people fall ill | పార్టీ కార్యక్రమంలో బిర్యానీ తిని.. పిల్లలతో సహా వంద మందికిపైగా ఆసుపత్రిపాలు
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెన్నై: ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. (people fall ill) వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని మదురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే శుక్రవారం పార్టీ కార్యక్రమం నిర్వహించింది. ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు సంక్షేమ సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమానికి హాజరైన వారికి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కొందరు అక్కడే బిర్యానీ తినగా, మరి కొందరు తమ ఇళ్లకు పట్టుకెళ్లారు.
కాగా, బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వంద మందికిపైగా వాంతులు, వికారం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 40 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని వెంటనే విల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధిత వ్యక్తుల సంఖ్య పెరుగడంతో పది అంబులెన్స్లను రప్పించారు. బిర్యానీ తిని అనారోగ్యం పాలైన వారిని విరుదునగర్, కల్లికుడిలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.
మరోవైపు డీఎంకే పార్టీ కార్యక్రమంలో పంపిణీ చేసిన బిర్యానీ పాడైందని, దీంతో అది తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమంగళం పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. పాడైన బిర్యానీ సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

