Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Air India: ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఇవాళ అత్యవసరంగా జైపూర్లో ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించినట్లు అధికారులు చెప్పారు. సెక్యూర్టీ చెకింగ్ కోసం ఐసోలేషన్ బేలోకి తీసుకెళ్లారు.
జైపూర్: జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానాన్ని ఇవాళ అత్యవసరంగా జైపూర్లో ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించినట్లు అధికారులు చెప్పారు. ఫ్లయిట్ ఏఐ20230 బోయింగ్ 787-9 విమానాన్ని అత్యవసరంగా జైపూర్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో దించారు. సెక్యూర్టీ చెకింగ్ కోసం ఐసోలేషన్ బేలోకి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి విమానాశ్రయ అధికారులు చెప్పినట్లు మాల్వీయ నగర్ ఏసీపీ శివదయాల్ పేర్కొన్నారు. ఈ ఘటనకు చెందిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉన్నది.
భద్రతా సిబ్బంది ప్రస్తుతం ఆ విమానాన్ని చెక్ చేస్తున్నట్లు తెలిపారు. స్క్వాక్ కోడ్ 7500ని పైలట్ నొక్కినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ముంబై ఫ్లయిట్ ఇన్ఫర్మేషన్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా జైపూర్కు మళ్లించారు. విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో ఇంకా స్పష్టం తెలియదు. ఎయిర్ ఇండియా సంస్థ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

