బెంగళూరు: విమానంలోని లగేజీని ఆఫ్‌లోడ్ చేయడం సిబ్బంది మరిచిపోయారు. దీంతో తమ బ్యాగులు, ఇతర లగేజీ కోసం సంబంధిత ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానం వెనక్కి మళ్లింది. (Flight U-Turn) ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి సింగపూర్‌కు ప్రయాణించింది. అయితే ప్రయాణికుల లగేజీని సిబ్బంది పూర్తిగా ఆఫ్‌లోడ్ చేయలేదు. దీంతో తమ బ్యాగులు, ఇతర లగేజీ కోసం సంబంధిత ప్రయాణికులు ఆందోళన చెందారు.
కాగా, ఆ విమానం బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. అయితే సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ కాగానే జరిగిన పొరపాటును సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అందులో ఉన్న మునుపటి ట్రిప్ ప్రయాణికులకు సంబంధించిన బ్యాగులు, ఇతర లగేజీని ఆఫ్‌లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల ఆలస్యంగా ఆ విమానం అక్కడి నుంచి బయలుదేరింది. దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.