గువాహటి: జీన్స్ ధరించి బెయిల్ పిటిషన్‌పై విచారణకు హాజరైన ఓ న్యాయవాదిపై గువాహటి హైకోర్టు శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీకే మహాజన్ అనే లాయర్‌పై సీరియస్ అయిన జస్టిస్ కళ్యాణ్రాయ్.. పోలీసులను పిలిచి న్యాయవాదిని బయటకు పంపించాలని ఆదేశించారు.
ఈ విషయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్, రిజిస్ట్రార్ జనరల్‌తో పాటు అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ బార్ కౌన్సిళ్ల దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు అధికారులను ఆదేశించారు.