Congress | మమతది పూటకో వైఖరి : కాంగ్రెస్ ఫైర్
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ మమతపై తీవ్రంగా మండిపడ్డారు. మమత ఒక్క స్టాండ్‌పై నిలబడరని ఎద్దేవా చేశారు. ఉదయం ఓ స్టాండ్, రాత్రి కో స్టాండ్.. ఇలా నిమిష నిమిషానికీ ఆమె తన వైఖరిని మార్చుకుంటుందని మండిపడ్డారు. ఒక్కోసారి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తారని, మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తారని మండిపడ్డారు. మళ్లీ… కాంగ్రెస్‌ను అంతం చేయాలని మరోసారి పిలుపునిస్తారని, ఇలా ప్రతి సారీ మమత వైఖరి మారుతూ ఉంటుందని అధీర్ తీవ్రంగా మండిపడ్డారు. మమతను నమ్మడం కష్టంగా ఉందని అధీర్ అన్నారు.
ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో పోరాటం చేపట్టేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం ఆ లేఖను రిలీజ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ సమయంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందన్నారు. అందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ అంశం గురించి చర్చిచేందుకు రావాలని, దేశంలోని ప్రగతిశీల పార్టీలు ఒక్కటిగా నిలిచి అణిచివేత దళాన్ని అడ్డుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

