” బెదిరించే బడా నేతలెవరో అదర్ పూనావాలా బయటపెట్టాలి “

ముంబై: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలాను బెదిరిస్తున్న పెద్ద నేతలు ఎవరన్నది ఆయన బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఆయనకు ఎవరూ కూడా ఎలాంటి ముప్పు కలిగించలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన వెంట ఉంటుందని, అయితే బెదిరిస్తున్న పవర్ఫుల్ నేతలు ఎవరన్నది అదర్ పూనావాలా వెల్లడించాలని కోరారు.
మహారాష్ట్ర హోంమంత్రి శంభురా దేశాయ్ కూడా ఇదే విషయం చెప్పారు. అదర్ పూనావాలాను ఎవరైనా బెదిరిస్తే ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అదర్ ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అదర్ పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో వై క్యాటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఇటీవల లండన్ వెళ్లిన అదర్, ది టైమ్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యాక్సిన్ సరఫరా కోసం భారత్‌లో పవర్ఫుల్ వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. తనపై ఒత్తిడి పెరిగిపోతున్నదని, ప్రతిదీ తాను ఒక్కడినే చేయలేనంటూ వాపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

