మతమార్పిడికి పాల్పడుతున్నారని నన్స్ను వేధించారు..

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను.. ఝాన్సీ రైల్వే స్టేషన్లో రైలు నుంచి బలవంతంగా కిందికి దించేశారు. మతమార్పుడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో.. ఏబీవీపీ సభ్యులు ఆ నన్స్ను కిందకు దించేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు క్రైస్తవ సన్యాసినులతో పాటు వారి వద్ద సేవకులుగా ఉన్న మరో ఇద్దర్ని కూడా ట్రైన్ నుంచి నెట్టివేశారు. రైల్వే స్టేషన్లో విచారణ చేపట్టిన తర్వాతే మళ్లీ రైలు ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ఘటన పట్ల చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. శుక్రవారం రోజున ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. క్రైస్తవ సన్యాసినులను రైలు దించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఓ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. హరిద్వార్-పురి ఉత్కల్ ఎక్స్ప్రెస్లో నన్స్ ప్రయాణించారు. 25 సెకన్ల వీడియోలో ఆ సైన్యాసినులను కొంత మంది చుట్టుముట్టారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

