కొడుకు ఎమ్మెల్యే అయినా స్కూల్లో ఊడ్చే పనికి వెళ్తున్న ఆప్ ఎమ్మెల్యే లాభ్ సింగ్ తల్లి.. ఎందుకో తెలుసా?
లాభ్ సింగ్కు మొబైల్ రిపేరింగ్ షాపు ఉంది. అత్యంత సామాన్యుడు. తన తండ్రి డ్రైవర్. తన తల్లి ఉగోకే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో
ఇటీవల వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలోనే పంజాబ్లో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే.. పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీని భదౌర్ నియోజకవర్గం నుంచి ఓడించింది ఎవరో కాదు.. మొబైల్ షాప్ ఓనర్ లాభ్ సింగ్. ఆప్ నుంచి భదౌర్ నియోజకవర్గంలో టికెట్ పొందిన లాభ్ సింగ్ను భదౌర్ నియోజకవర్గ ఓటర్లు 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు.

లాభ్ సింగ్కు మొబైల్ రిపేరింగ్ షాపు ఉంది. అత్యంత సామాన్యుడు. తన తండ్రి డ్రైవర్. తన తల్లి ఉగోకే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ స్వీపర్. మాజీ ముఖ్యమంత్రి చన్నీని ఓడించింది ఎవరో కాదు.. మొబైల్ రిపేర్ చేసే షాప్ ఓనర్ అంటూ పంజాబ్లో విజయం తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

లాభ్ సింగ్ ఎమ్మెల్యే అయినా.. లాభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో ఊడ్చే పనికి వెళ్తోంది. నా కొడుకు ఎమ్మెల్యే కావడం నాకు సంతోషమే. అది కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని నా కొడుకు ఓడించాడు. ఏది ఏమైనప్పటికీ.. మాకు ఊడ్చే పనే మూడు పూటలా తిండి పెట్టింది. ఈ సమయంలో నేను నా పనిని వదులుకోలేను. ఏది ఏమైనా చీపురును వదలను. నా డ్యూటీని నేను కొనసాగిస్తా. ఇదే నాకు తెలిసింది. ఇదే నా జీవితం. ఊడ్చే పని ద్వారా వచ్చే జీతంతోనే ఇన్నేళ్లు మా ఇల్లు గడిచింది. ఇప్పుడు కూడా ఆ జీతంతోనే మా ఇంటిని ముందుకు నడిపిస్తా.. అని బల్దేవ్ కౌర్ మీడియాకు తెలిపింది.
Punjab | Baldev Kaur, mother of AAP’s Labh Singh, who defeated Congress’ Charanjit S Channi from Bhadaur in Barnala, continues to work as a sweeper at a govt school in Ugoke village. She says,” ‘Jhadu’ is an important part of my life. I’ll continue to do my duty at the school.” pic.twitter.com/OuX5kIPLFr
— ANI (@ANI) March 13, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

