MLA Amanatullah Khan: వక్ఫ్ బోర్డులో అక్రమాలు.. ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ అరెస్టు
MLA Amanatullah Khan: ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలు చోటుచేసుకున్న కేసులో.. ఇవాళ ఈడీ అధికారులు ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ను అరెస్టు చేశారు. ఉదయం ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(MLA Amanatullah Khan)ను ఇవాళ ఈడీ అరెస్టు చేసింది. ఇంట్లో సోదాల తర్వాత ఆయన్ను ఆధీనంలోకి తీసుకున్నది. ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా.. మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన నియామకాల్లో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. గతంలో వక్ఫ్ బోర్డుకు ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ అధినేతగా చేశారు.
ఢిల్లీలోని ఓక్లా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఖాన్.. ఇవాళ ఉదయం 630 నిమిషాలకు ట్వీట్ చేశారు. తనను అరెస్టు చేసేందుకు ఈడీ తన నివాసానికి వచ్చినట్లు ఆయన ఆరోపించారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఖాన్ ఇంటికి వెళ్లినట్లు ఈడీ అధికారులు చెప్పారు. ఇదే కేసులో ఎమ్మెల్యేకు సమన్లు ఇచ్చి 13 గంటల పాటు విచారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

