న్యూఢిల్లీ: తన నోరు నొక్కినా, తనను ఓడించలేరని ఎంపీ రాఘవ్ చద్దా తన ఎక్స్ అకౌంట్లో వీడియో పోస్టు చేసిన విషయం తెలిసిందే. రాఘవ్‌కు మైక్ ఇవ్వవొద్దు అని రాజ్యసభ సెక్రటేరియేట్‌కు ఆప్(Aam Aadmi Party) లేఖ రాసిన నేపథ్యంలో.. ఎంపీ రాఘవ్ ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే రాఘవ్ వ్యాఖ్యలకు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. పార్లమెంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ రాఘవ్ సూటిగా మాట్లాడలేకపోతున్నట్లు ఆప్ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంలో రాఘవ్ చద్దా దాక్కున్నారని భరద్వాజ్ ఆరోపించారు. బీజేపీ కండ్లల్లోకి చూసి ప్రశ్నలు వేయాలని, కానీ చాలా సున్నితంగా ప్రశ్నలు అడగడం కాదు అని అన్నారు. మీ ప్రశ్నలు బీజేపీని ఇబ్బంది పెట్టలేదని, ఆ పార్టీ మీకు సపోర్టు ఇస్తున్నట్లుగా ఉందని సౌరభ్ పేర్కొన్నారు. మేం కేజ్రీవాల్ సైనికులమని, మేం ఒక్కటే నేర్చుకున్నామని, జో డర్ గయా.. సమ్జో మర్ గయా అని భరద్వాజ్ అన్నారు. ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా నిలదీయాలని, పార్లమెంట్లో సాఫ్ట్ పీఆర్ చేయడం కాదు అని పేర్కొన్నారు. పార్లమెంట్లో పంజాబీ సమస్యలను ఎంపీ రాఘవ్ ప్రస్తావించలేదని ఆప్ నేత ఆరోపించారు.
🚨 BREAKING: Saurabh Bhardwaj takes on Raghav Chadha
Politics isn’t about fear, it’s about questioning power
Not samosa issues, real issues matter
Opposition walked out, you stayed
AAP MPs jailed, you were in LondonOpposition is for people, not PR
FEAR MEANS FINISHED 🎯 pic.twitter.com/3BsgeD8EOo
— Mr Sharma (@sharma_views) April 3, 2026