Aam Aadmi Party | ఆప్ కీలక నిర్ణయం.. గోవా యూనిట్ రద్దు
Aam Aadmi Party | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (Aam Aadmi Party) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా యూనిట్‌ను తక్షణమే రద్దు చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (Aam Aadmi Party) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా యూనిట్‌ను తక్షణమే రద్దు చేసింది. అయితే పార్టీ రాష్ట్ర చీఫ్‌గా అమిత్ పాలేకర్ కొనసాగుతారని తెలిపింది. గోవాలో రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని త్వరలో నియమిస్తామని ఆప్ పేర్కొంది. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసింది. ‘గోవాలో అధ్యక్ష పదవి మినహా, పార్టీ మొత్తం విభాగాన్ని తక్షణమే రద్దు చేస్తున్నాం. అమిత్ పాలేకర్ మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారు’ అని పేర్కొంది. గోవాలో పార్టీ కొత్త కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని ఆప్ తెలిపింది.
కాగా, 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కూడా పోటీ చేసింది. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడంతోపాటు రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలపైనా ఆప్ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో గోవాలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న పార్టీ రాష్ట్ర విభాగాన్ని ఆప్ రద్దు చేసినట్లు తెలుస్తున్నది.
⚠️ ANNOUNCEMENT ⚠️
The party hereby dissolves the present organisation in the state of Goa with immediate effect, except for the position of State President
Shri @AmitPalekar10 will continue to function as the State President.
The new organisational structure will be announced… pic.twitter.com/E6ozGYBAxI
— AAP (@AamAadmiParty) May 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

