Aadhar Update | ఆధార్ అప్డేట్ గడువు పొడిగించిన UIDAI.. అప్పటి వరకు ఉచితమే..!
Aadhar Update | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది.
Aadhar Update | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ప్రస్తుతం గడువు సెప్టెంబర్ 14తో ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్ యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఆధార్‌కార్డును అప్డేట్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఆధార్ జారీ పదేళ్లు దాటిన వారి వివరాలను మళ్లీ అప్డేట్ ప్రక్రియను యూఐడీఏఐ ప్రారంభించింది. అడ్రస్, వ్యక్తిగత వివరాలు మార్చుకోవాలనునేవారు అందుకు సంబంధించిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్లి రూ.50 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 14 వరకు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. myaadhaar.uidai.gov.in వెబ్సైట్లోనూ ఉచితంగానే ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునే వీలుకలుగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

