న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రజల కోసం ఆధార్ మిత్ర చాట్‌బాట్ సేవ అందుబాటులోకి వచ్చింది. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పీవీసీ కార్డు స్టేటస్, ఆధార్ స్టేటస్, ఈ-ఆధార్ సేవలను వినియోగించుకొనేలా దీన్ని అందుబాటులోకి తెచ్చినట్టు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఈ చాట్‌బాట్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సేవలు అందిస్తుంది.