ఫాల్టా: పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గ రీ పోలింగ్‌కు రెండు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకొంది. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం ప్రకటించారు. ‘ఫాల్టాలో శాంతి భద్రతలు ఉండాలన్నది నా ఉద్దేశం. ఈ నియోజక వర్గం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
‘బంగారు ఫాల్టా’ నా లక్ష్యం. మన సీఎం ఫాల్టా ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారు. ఇందువల్లే నేను నామినేషన్‌ను ఉపసంహరించుకొంటున్నాను. నియోజకవర్గ అభివృద్ధి, శాంతి కోసమే ఈ పని చేస్త్తున్నా’ అని ఖాన్ తెలిపారు.