న్యూఢిల్లీ : బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల్లో అనేక మంది సుదీర్ఘ కాలంపాటు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇటువంటి బాధితులు ఏటా దాదాపు 4 కోట్ల మంది వరకు ఉంటున్నట్లు తెలిపింది.
బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి 8 వారాల తర్వాత సెక్స్‌లో పాల్గొన్నపుడు నొప్పితో బాధపడేవారు 35 శాతమని, 32 శాతం మంది నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నారని తెలిపింది. 8-31 శాతం మంది అనూహ్య మూత్ర విసర్జనతో, 9-24 శాతం మంది ఆందోళనతో, 11-17 శాతం మంది మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఆరోగ్య సమస్యలు కొందరిలో కొన్ని నెలలపాటు, మరికొందరిలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటున్నట్లు తెలిపింది.