Angrez Singh | ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో పరీక్షకు.. తర్వాత ఏమైందో తెలిస్తే నవ్వాపుకోలేరు..!
Angrez Singh | పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో తాజాగా చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన సినిమాల్లోని కామెడీ సీన్ మించి నవ్వించింది. ఆ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు, అధికారులు విషయం తెలిసిన తర్వాత నవ్వాపుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Angrez Singh: పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో తాజాగా చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన సినిమాల్లోని కామెడీ సీన్ మించి నవ్వించింది. ఆ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు, అధికారులు విషయం తెలిసిన తర్వాత నవ్వాపుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ యువకుడు తన ప్రియురాలికి బదులుగా పరీక్ష రాసేందుకు చేసిన విఫలయత్నమే ఈ కామెడీకి కారణమైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పరీక్ష జరిగింది. కోట్కపురాలోని DAV పాఠశాలలో కూడా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు తన ప్రియురాలికి బదులుగా పరీక్ష రాసేందుకు యువతి వేషధారణలో వచ్చాడు.
లేడీస్ సూట్ వేసుకుని, ఎరుపురంగు గాజలు ధరించి, నుదుట తిలకం పెట్టుకుని, పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుని అచ్చం అమ్మాయిలా తయారై వచ్చేసరికి ఎవరూ గుర్తించలేకపోయారు. పరీక్ష మొదలైంది. అమ్మాయి వేషధారణలో దిగిన ఫొటోతో తన గర్ల్‌ఫ్రెండ్ పరంజీత్ కౌర్ పేరిట తయారు చేయించుకున్న నకిలీ గుర్తింపు కార్డులను కూడా అధికారులు పసిగట్టలేకపోయారు. అయినా చివరికి అతని బండారం బయటపడింది.
ఇన్విజిలేటర్ ఒక్కొక్కరి దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటూ అంగ్రేజ్ సింగ్ దగ్గరకు వచ్చాడు. అంగ్రేజ్ సింగ్ వేలిముద్రలు అసలు క్యాండిడేట్ పరంజీత్ కౌర్ వేలిముద్రలు వేరు కావడంతో సరిపోలలేదు. అంగ్రేజ్ వేషం పకడ్బందీగా ఉండటంతో అయినా ఇన్విజిలేటర్‌కు అనుమానం రాలేదు. సాంకేతి సమస్యేమోనని పై అధికారుల దృష్టికి తీసుకుకెళ్లాడు.
వాళ్లు వచ్చి వేలిముద్రలు వేయించి చూసినా మ్యాచ్ కాలేదు. దాంతో అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో తను అమ్మాయి వేషంలో వచ్చిన అబ్బాయి అని తేలింది. అది చూసి ఆ హాల్లో పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులతోపాటు ఇన్విజిలేటర్లు, అధికారులు నవ్వాపుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంగ్రేజ్ను పోలీసులకు అప్పగించారు. పరంజీత్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

