న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి లండన్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వరుసగా మూడుసార్లు మేయర్‌గా విజయం సాధించిన లేబర్ పార్టీకి చెందిన సాదిక్ ఖాన్‌పై ఆయన పోటీ పడుతున్నారు. మే 2న జరిగే ఈ ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులలో 63 ఏండ్ల గులాటి ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో లండన్ వాసులు మేయర్‌తో పాటు లండన్ అసెంబ్లీకి సభ్యులను కూడా ఎన్నకుంటారు. ఒక వ్యాపారవేత్తగా, ఇన్వెస్ట్మెంట్ నిపుణుడిగా తన అనుభవాన్ని వినియోగిస్తానని, లండన్‌ను ‘గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ది వరల్డ్’గా తీర్చి దిద్దుతానని, పౌరుల భద్రత, లాభదాయకతతో పాటు ఉత్తమ పాలన అందిస్తానని ఆయన పౌరులకు హామీనిచ్చారు.