ఐదు రోజుల పసికందును బస్టాండు టాయిలెట్లో విడిచివెళ్లిన తల్లి..!
Newborn Baby Boy | బిడ్డలను కని చెత్త కుప్పల్లోనో, ముళ్ల పొదల్లోనో, రైల్వేస్టేషన్లలోనో, బస్టాండ్లలోనో వదిలివెళ్లే ఘటనలు రోజురోజుకు
అంబాలా: బిడ్డలను కని చెత్త కుప్పల్లోనో, ముళ్ల పొదల్లోనో, రైల్వేస్టేషన్లలోనో, బస్టాండ్లలోనో వదిలివెళ్లే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట కన్న తల్లులే తమ పేగు బంధాలను వదిలేసి వెళ్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హర్యానా రాష్ట్రంలోని అంబాలా కంటోన్మెంట్ బస్టాండ్‌లో అలాంటి ఘటనే జరిగింది.
నాలుగైదు రోజల వయసున్న మగబిడ్డను ఓ తల్లి బస్టాండులోని టాయిలెట్స్‌లో విడిచిపెట్టి వెళ్లింది. టాయిలెట్లోకి వెళ్లిన ఓ ప్రయాణికురాలు పసికందును గమనించి బస్టాండ్‌లోని అధికారులకు సమాచారం ఇచ్చింది. అస్వస్థతకు గురై ఉన్న ఆ చిన్నారిని అధికారులు స్థానికంగా ఉన్న సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆ చిన్నారి పుట్టుకామెర్లతో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు.
కాగా, ఘటనపై బస్టాండ్ అధికారులు స్థానిక లాల్ కుర్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బస్టాండ్‌లో పసికందును వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

