భారతీయులు కొబ్బరి నీళ్లను బాగా ఇష్టపడుతారు. డీహైడ్రేషన్‌కు గురైన శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేయడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడుతాయి. అందుకే వేసవి కాలంలో కొబ్బరి బోండాలకు యమా డిమాండ్ ఉంటుంది. అయితే సహజసిద్ధమైన ఈ కొబ్బరి నీళ్లను ఏమీ కలపకుండా ఉన్నవి ఉన్నట్టే తాగుతాం. అలా తాగితేనే అవి బాగుంటాయి కూడా. కానీ ఎవరైనా కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపడం చూశారా..? వాక్.. అదేం కాంబినేషన్ అనుకుంటున్నారా..? కానీ ఇటీవల ఓ వ్యక్తి కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి ఇంటర్నెట్లో ఫ్యామస్ అయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. అరుణ్ దేవ్ అనే ఓ ట్విటర్ యూజర్.. తాను కొబ్బరి బోండాంలో నిమ్మరసాన్ని కలుపుతూ దిగిన ఓ ఫొటోను తన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేశాడు. ఆ ఫొటోకు ‘ఇది ఇంత పాపులర్ కాంబినేషన్ అని నాకు ఇప్పటిదాకా తెలియదు’ అంటూ ఇంగ్లిష్‌లో క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫొటో ప్రస్తుతం ట్విటర్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ ఫొటోను 1,13,100 మంది వీక్షించారు. 1100 మంది లైక్ చేశారు. పైగా కామెంట్ల వర్షం కురుస్తున్నది.
I didn’t know this was a popular combination. pic.twitter.com/oQH9q1xgh9
— Arun Dev (@ArunDev1) February 11, 2023
‘ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంగళూరులో దీన్ని బోంబా లైమ్ అంటారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇలాంటి కాంబినేషన్‌ను నేను అస్సలు ఊహించలేదు. ఈ సారి మనం కొబ్బరిబోండాంలో ఓల్డ్ మంక్ రమ్ లేదా టెక్విలా కలిపి చూద్దాం’ అని ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘దీనికి కొంచెం ఉప్పు కలిసి తీసుకుంటే సూపర్ ఉంటది’ అని మరో ట్విటర్ యూజర్ రిప్లై ఇచ్చాడు.