గర్భిణీని ట్రాక్టర్‌తో తొక్కించిన లోన్ రికవరీ ఏజెంట్
రుణ రికవరీ ఏజెంట్ ఓ గర్భిణీని ట్రాక్టర్‌తో తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
- జార్ఖండ్‌లో దారుణం
- మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ ఎదుట బాధితుల ఆందోళన
హజారిబాగ్ (జార్ఖండ్), సెప్టెంబర్: రుణ రికవరీ ఏజెంట్ ఓ గర్భిణీని ట్రాక్టర్‌తో తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఇచాక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బరియానాథ్కు చెందిన మిథిలేశ్ మెహతా అనే దివ్యాంగ రైతు మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ రుణంతో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. రూ.1.3 లక్షలు తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో ట్రాక్టర్ తీసుకెళ్తామని హెచ్చరిస్తూ గురువారం రైతు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.
హైవే-33లోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్‌ను శుక్రవారం తీసుకెళ్లేందుకు రుణ రికవరీ ఏజెంట్ ప్రయత్నించాడు. రుణం 1.2 లక్షలు చెల్లిస్తామని, ట్రాక్టర్‌ను తీసుకెళ్లవద్దని రైతు ప్రాధేయపడ్డాడు. 3 నెలల గర్భిణి అయిన రైతు కూతురు కూడా ట్రాక్టర్‌ను తీసుకెళ్లవద్దని కోరింది. ఏదీ వినిపించుకోని రికవరీ ఏజెంట్.. గర్భిణిపై నుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్లడంతో ఆమె చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించింది. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని హజారిబాగ్‌లోని ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం ఎదుటపెట్టి ఆందోళన చేపట్టారు. ఈ కేసులో నలుగురిపై హత్య కేసు నమోదు చేసి, రికవరీ ఏజెంట్, ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ సహా నలుగురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

