చండీగఢ్: పంజాబ్‌లోని జాతీయ రహదారి పక్కన ఒక బాక్స్‌లో గ్రెనేడ్‌ను గుర్తించారు. బటిండా-అమృత్సర్ హైవే సమీపంలో లభించిన పెట్టెలో గ్రెనేడ్ ప్యాక్ చేసి ఉన్నట్లు ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ హర్మన్దీప్ సింగ్ హన్స్ తెలిపారు. దానిని నిర్వీర్యం చేసేందుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ని పిలిపించినట్లు చెప్పారు. ఆ ప్రాంతాన్ని మూసి వేయడంతోపాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడ తనిఖీలు చేస్తున్నదని ఆ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.