ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారు. యూ ట్యూబ్ షాట్స్ కూడా తీస్తున్నారు. ఆ చిన్న చిన్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందులో ఫన్నీ వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ఓ యువతి ఎద్దు ముందు డ్యాన్స్ చేస్తూ రీల్ చేస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు.
ఈ వీడియోను ‘బుట్నీ కే మీమ్స్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో నల్లటి క్రాప్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన అమ్మాయి వీధిలో ఎద్దు ముందు ఒక రీల్‌ను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, బెదిరిపోయిన ఎద్దు ఆమెపైకి రావడంతో యువతి పరుగెత్తుతుంది. ఈ వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పించింది. ఈ వీడియో చూసి చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.