ముంబై: మహారాష్ట్రలోని పుణె నగరంలో జికా వైరస్ కలకలం రేగింది. పుణెలోని బవ్ధాన్ ఏరియాలో 67 ఏండ్ల వృద్ధుడికి జికా వైరస్ సోకింది. పేషెంట్లో జికా వైరస్ ఉన్నట్టు పుణెలో బయటపడినా వాస్తవానికి ఆయన నాసిక్‌కు చెందినవాడు. గత అక్టోబర్ 22న అతను నాసిక్ నుంచి సూరత్‌కు వెళ్లాడు. గత నెల 6న ఆయన సూరత్ నుంచి పుణెకు చేరుకున్నాడు.
అదే సమయంలో వృద్ధుడు అనారోగ్యానికి గురవడంతో వైద్యులు ఆయన నుంచి శాంపిల్స్ తీసి పరీక్షల కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. గత నెల 30న పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆ వృద్ధిడిలో జికా వైరస్ ఉన్నట్లు తేల్చింది. అయితే ప్రస్తుతం వృద్ధుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.