Ramleela | ముంబై: రామ్లీలా ఆధారంగా ప్రదర్శించిన ఓ నాటకంలో అభ్యంతరకర దృశ్యాలు, సంభాషణలు ఉన్నాయన్న ఆరోపణలపై మహారాష్ట్రలోని పుణే యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. ఏబీవీపీ ఫిర్యాదు మేరకు వీరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
వర్సిటీలోని లలితకళా కేంద్రం లో శుక్రవారం సాయంత్రం నాటకం ప్రదర్శించారు. నాటకంలో భాగంగా సీత వేషం వేసిన పురుషుడు.. సిగరెట్ తాగాడని, అసభ్యకర భాష వాడాడని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ఈ నాటకంలో ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని పేర్కొన్నారు.