న్యూఢిల్లీ, నవంబర్ 19: ప్రతికూల ఆలోచనలు, నిరంతరం విచారంలో వుండటం..‘డిప్రెషన్’ ముఖ్య లక్షణాలు. దీనిబారిన పడ్డ టీనేజర్స్ రక్తంలోని జీవకణాలు ప్రత్యేక లక్షణాల్ని కలిగి ఉన్నాయని, సాధారణమైన రక్త పరీక్షతో దీనిని ముందుగానే గుర్తించవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది. రక్తంలోని 9 రకాల మైక్రోఆర్ఎన్ఏ జీవకణాలకు డిప్రెషన్‌కు సంబంధం ఉందని, టీనేజ్ యువతీ యువకుల మెదడు అభివృద్ధిపై దీని ప్రభావం పడుతున్నదని సైంటిస్టు సిసిలా ఫ్లోరెస్ అన్నారు. రక్త నమూనాలు సేకరించిన 9 నెలల తర్వాత డిప్రెషన్‌కు కారణమైన మైక్రోఆర్ఎన్ఏల సంఖ్య రక్తంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నదని సైంటిస్టులు తమ అధ్యయనంలో కనుగొన్నారు.