2డీజీ ఒక్కో సాచెట్ రూ.990

- ధరలను నిర్ణయించిన డాక్టర్ రెడ్డీస్
- ప్రభుత్వ దవాఖానలకు డిస్కౌంట్
న్యూఢిల్లీ, మే 28: కరోనా చికిత్సలో గేమ్‌చేంజర్‌గా మారుతుందని భావిస్తున్న 2డీజీ ఔషధం ధరలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. ఒక్కో సాచెట్ ధర రూ.990గా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దవాఖానలకు మాత్రం డిస్కౌంట్ ధరలకు లభించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే తగ్గింపు ఎంతన్నది మాత్రం స్పష్టంచేయలేదు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారంతో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు (డీఆర్డీవో) చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ (ఇన్మాస్) ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లోని సీసీఎంబీ కూడా సహకారం అందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

