Madurai | మధురైలో ఆగివున్న రైలు కోచ్‌లో మంటలు.. 10 మంది సజీవదహనం
Madurai | తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం జరిగింది. పునలూరు - మధురై ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ప్రయివేటు పార్టీ కోచ్‌లో మంటలు చెలరేగి 10 మంది సజీవదహనం అయ్యారు. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న ఈ రైలులో శనివారం తెల్లవారుజామున 5:15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
Madurai | చెన్నై : తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం జరిగింది. పునలూరు – మధురై ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ప్రయివేటు పార్టీ కోచ్‌లో మంటలు చెలరేగి 10 మంది సజీవదహనం అయ్యారు. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న ఈ రైలులో శనివారం తెల్లవారుజామున 5:15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న పునలూరు – మధురై ఎక్స్‌ప్రెస్ రైలుకు నాగర్‌కోయిల్ వద్ద ప్రయివేటు పార్టీ కోచ్‌ను నిన్న సిబ్బంది చేర్చింది. ఈ కోచ్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రైల్వే సిబ్బంది కళ్లుగప్పి.. సిలిండర్‌ను రహస్యంగా లోపలికి తీసుకొచ్చారు. ఇక శనివారం తెల్లవారుజామున మధురై స్టాబ్లింగ్ లైన్ వద్ద.. ప్రయివేటు పార్టీ కోచ్‌ను మధురై ఎక్స్‌ప్రెస్ నుంచి వేరు చేశారు. ఈ సమయంలో చాయ్ చేసుకునేందుకు ఆ కోచ్‌లోని పర్యాటకులు సిలిండర్‌ను వెలిగించారు. దీంతో కోచ్‌లో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమైన కిందకు దిగేశారు. 10 మంది సజీవదహనం అయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
#WATCH | Tamil Nadu: Fire reported in private/individual coach at Madurai yard at 5:15 am today in Punalur-Madurai Express. Fire services have arrived and put off the fire and no damage has caused to another coaches. The passengers have allegedly smuggled gas cylinder that caused… pic.twitter.com/5H7wQeGu93
— ANI (@ANI) August 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

