Homework | హోం వర్క్ చేయలేదని కిడ్నాప్ డ్రామా ఆడిన ఎనిమిదో తరగతి కుర్రాడు
బిలాస్‌పూర్‌కు చెందిన ఓ కుర్రాడు స్థానిక పాఠశాలలో 8వ తరగతి (8th class Student) చదువుతున్నాడు. జూలై కురిసిన భారీ వానలతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వర్షాలు తగ్గడంతో ఈ నెల నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.
బిలాస్పూర్: గత వారం దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. దీంతో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. వరణుడు శాంతించడంతో ఈ నెల 1న స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సెలవులతోపాటు విద్యార్థులకు టీచర్లు హోం వర్క్ ఇచ్చారు. అసలే వానలు.. అందులోనూ పిల్లలు.. సెలవులను ఎంజాయ్ చేశారు. అయితే సెలవులు ముగిసి స్కూల్‌కి వెళ్లే రోజున హోం వర్క్ (Homework) గుర్తొచ్చింది. క్లాస్‌కి వెళ్తే టీచర్లు హోం వర్క్ గురించి అడుగుతారు. అది పూర్తిచేయలేదు కాబట్టి ఏదో ఒక శిక్ష (Punishment) వేస్తారు. దీంతో ఓ 8వ తరగతి విద్యార్థికి మాంచి ఉపాయం వచ్చింది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి కిడ్నాప్ డ్రామా (Fake kidnapping) ఆడాడు. కట్టు కథ అల్లి తల్లిదండ్రులను నమ్మించిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachal Pradesh) బిలాస్పూర్లో (Bilaspur) జరిగింది.
బిలాస్‌పూర్‌కు చెందిన ఓ కుర్రాడు స్థానిక పాఠశాలలో 8వ తరగతి (8th class Student) చదువుతున్నాడు. జూలై కురిసిన భారీ వానలతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వర్షాలు తగ్గడంతో ఈ నెల నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే స్కూళ్లో ఇచ్చిన హోం వర్క్ అతడు పూర్తిచేయలేదు. పాఠశాలకు వెళ్తే హోం వర్క్ చెక్ చేస్తారని, పూర్తిచేయనికి వారికి శిక్ష వేస్తారని భయపడ్డాడు. దానిని తప్పించుకోవడానికి ఓ ఉపాయం ఆలోచించాడు.
అనుకున్నదే తడవుగా ఓ కట్టుకథను తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ‘స్కూళ్కు వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చి ఆపారు. వారిరువురు మాస్కులు ధరించి ఉన్నారు. ఓ వస్తువు వాసన చూపించడంతో స్పృహ కోల్పోయాను. అనంతరం బైక్‌పై ఎత్తుకెళ్లారు. అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత సిగ్నల్ పడటంతో బైక్‌ను ఆపారు. అప్పటికే తనకు మెళకువ వచ్చింది. దీంతో ఎలాగోలా వారిని తప్పించుకుని ఇంటికి వచ్చా’నని తల్లిదండ్రులను నమ్మించాడు. అయితే తమ పిల్లవాడు చెప్పిన కథను నమ్మిన తల్లిదండ్రులు హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దుండగులు తన కుమారుడిని కిడ్నాప్ చేయడానికి యత్నించారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అతడు చెప్పిన వివరాల ప్రకారం ఆయా ప్రదేశాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఎలాంటి అనుమానాస్పద దృష్యాలు కనిపించకపోవడంతో.. విద్యార్థి కట్టుకథ చెప్పాడని గ్రహించారు. స్టేషన్ పిలిచి తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు. హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాలు శిక్ష విధిస్తారని, దానిని తప్పించుకోవడానికి ఇందా చేశానని ఒప్పుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

