Jharkhand Workers Captive In Bihar | ఉపాధి కోసం వెళ్లిన జార్ఖండ్ కార్మికులు బీహార్‌లో బందీ.. సీఎం జోక్యం
Jharkhand Workers Captive In Bihar | జార్ఖండ్‌కు చెందిన వలస కార్మికులు ఉపాధి కోసం బీహార్ వెళ్లారు. అయితే గయ జిల్లాలో వారు బందీ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న జార్ఖండ్ సీఎం వెంటనే స్పందించారు. తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాంచీ: జార్ఖండ్‌కు చెందిన వలస కార్మికులు ఉపాధి కోసం బీహార్ వెళ్లారు. అయితే గయ జిల్లాలో వారు బందీ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న జార్ఖండ్ సీఎం వెంటనే స్పందించారు. తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో బీహార్‌లో చిక్కుకున్న జార్ఖండ్ కూలీలు సురక్షితంగా తమ రాష్ట్రానికి చేరుకున్నారు. (Jharkhand Workers Captive In Bihar) జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లా హర్లాదిహ్ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 8 మంది కార్మికులు ఉపాధి కోసం బీహార్ వెళ్లారు. అయితే గయ జిల్లాకు చేరుకున్న తర్వాత బందీగా ఉన్న పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు. అక్కడ చిక్కుకున్న ఆ కూలీలు తమ దుస్థితి గురించి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.
కాగా, ఆ కార్మికులు బీహార్‌లో నిర్బంధం కావడంపై వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. ఈ విషయాన్ని సీఎం హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందింది జోక్యం చేసుకున్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు సీఎం ఆదేశాలతో గిరిదిహ్ జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. బీహార్ అధికారులను వారు సంప్రదించారు. సంబంధిత అధికార సంస్థలతో సమన్వయం చేసుకున్నారు. బీహార్‌లో బందీ అయిన 8 మంది కార్మికులు సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం వారంతా తమ గ్రామాలకు క్షేమంగా చేరుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- captive
- CM Hemant Soren
- Gaya
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Jharkhand Workers Captive In Bihar | ఉపాధి కోసం వెళ్లిన జార్ఖండ్ కార్మికులు బీహార్‌లో బందీ.. సీఎం జోక్యం
Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

