Delhi Schools: ఢిల్లీలో 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Delhi Schools : ఢిల్లీలో ఇవాళ సుమారు 50 స్కూళ్లకు మెయిల్ బెదిరింపు చేశారు. టెర్రరైజర్స్ 111 అనే గ్రూపు వివిధ స్కూళ్లకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. 25 వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో మళ్లీ స్కూళ్ల(Delhi Schools)కు బెదిరింపులు వచ్చాయి. ఇవాళ సుమారు 50 స్కూళ్లకు మెయిల్ బెదిరింపు చేశారు. పోలీసులు దీన్ని ద్రువీకరించారు. టెర్రరైజర్స్ 111 అనే గ్రూపు వివిధ స్కూళ్లకు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. డీఏవీ పబ్లిక్ స్కూల్, ఫెయిత్ అకాడమీ, డూన్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయతో పాటు ఇతర స్కూళ్ల బెదిరింపులు వచ్చాయి. 25 వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు.
క్రిప్టోకరెన్సీ రూపంలో 5వేల డాలర్లు ఇవ్వాలంటూ అదే గ్రూపు ఆగస్టు 18వ తేదీన బాంబు బెదిరింపులకు పాల్పడింది. ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటర్స్‌కు బెదిరింపు గ్యాంగ్ బల్క్ మెయిల్ పంపింది. ఐటీ సిస్టమ్స్‌ను ఉల్లంఘించినట్లు తెలిపారు. స్కూల్ ఆవరణల్లో 48 గంటల్లోగా బాంబులు పేల్చుతామని మెయిల్లో పేర్కొన్నారు. మేం టెర్రరైజర్స్ 111 గ్రూపుకు చెందినవాళ్లమని, మీ బిల్డింగ్‌లో పేలుడు పదార్ధాలు అమర్చామని, క్లాస్‌రూమ్‌లూ.. ఆడిటోరియంలు, స్టాఫ్ రూమ్‌లు, స్కూల్ బస్సులను శక్తివంతమైన సీ4 బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

