Jharkhand | పెండ్లికి వెళ్లి వస్తుండగా బోల్తాపడిన వ్యాన్.. ఐదుగురు దుర్మరణం
జార్ఖండ్‌లోని (Jharkhand) గుమ్లాలో (Gumla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి (Wedding ceremony) తిరిగివస్తున్న ఓ పికప్ వ్యాన్ (Pickup Van) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాంచీ: జార్ఖండ్‌లోని (Jharkhand) గుమ్లాలో (Gumla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి (Wedding ceremony) తిరిగివస్తున్న ఓ పికప్ వ్యాన్ (Pickup Van) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 50 మంది ఉన్నారని చెప్పారు.
దుమ్రిలోని సరాన్‌దిహ్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. జార్దా గ్రామ సమీపంలో అదుపుతప్పిన వ్యాన్.. బోల్తా పడిందని, మూడుసార్లు పల్తీలు కొట్టడంతో ఐదుగురు మృతిచెందారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

