16 ఏండ్ల బాలికపై అమానుషం.. పెండ్లికి నిరాకరించిందని పదునైన ఆయుధంతో దాడిచేసి.. జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు
తనతో పెండ్లికి నిరాకరించిందని 16 ఏండ్ల బాలికను 47 ఏండ్ల వయస్సున్న వ్యక్తి పదునైన ఆయుధంతో దాడిచేసి నడి రోడ్డుపై జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటన ఛత్తీగఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌లో (Raipur) చోటుచేసుకున్నది.
రాయ్‌పూర్: తనతో పెండ్లికి నిరాకరించిందని 16 ఏండ్ల బాలికను 47 ఏండ్ల వయస్సున్న వ్యక్తి పదునైన ఆయుధంతో దాడిచేసి నడి రోడ్డుపై జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటన ఛత్తీగఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌లో (Raipur) చోటుచేసుకున్నది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాయ్‌పూర్‌లోని గుఢియారీ ప్రాంతంలో ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ అనే వ్యక్తి ఓ దుకాణం నడుపుతున్నాడు. గతకొంతకాలంగా అతని వద్ద ఓ 16 ఏండ్ల బాలిక పనిచేస్తున్నది. అయితే వివిధ కారణాల రీత్యా తాను ఉద్యోగం మానేస్తానని అతనికి చెప్పింది. దానికి అతడు ఒప్పుకోకపోగా, శనివారం సాయంత్రం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి ఆ మైనర్ బాలికతోపాటు ఆమె తల్లి నిరాకరించారు. దీంతో ఆగ్రహంతో ఆ బాలికపై పదునైన ఆయుధంతో దాడిచేశాడు. అంతటితో ఆగకుండా ఆమె జట్టుపట్టుకుని అంతా చూస్తుండగా రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష ఘటనను కొందరు తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇదికాస్తా వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నింధితుడికి కఠినంగా శిక్షిస్తామన్నారు.
ये दरिंदा जो लड़की पर हमला करके सड़क पर घूमा रहा है… मुझे उससे ज़्यादा ग़ुस्सा वहां पर खड़ी मुर्दा जनता को देखकर आ रहा है.
लड़की के सिर और पूरे शरीर पर गड़ासे से वार किया गया और पूरे रायपुर में उसे घसीट गया. डेढ़ घंटे से यह तमाशा चलता रहा और छत्तीसगढ़ पुलिस सोती रही? pic.twitter.com/7uYLCVhYSS
— Vivi28 (@Vivi28Official) February 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

