నాలుగుసార్లు ఎమ్మెల్యే.. కరోనాతో కన్నుమూత
నాలుగుసార్లు ఎమ్మెల్యే| అతనో ప్రజాధరణ కలిగిన నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితేనేం.. అంతా తనకు సమానమే అన్నట్లు కరోనా మహమ్మారి అతని ప్రాణాలను బలితీసుకుంది.

గువాహటి: అతనో ప్రజాధరణ కలిగిన నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితేనేం.. అంతా తనకు సమానమే అన్నట్లు కరోనా మహమ్మారి అతని ప్రాణాలను బలితీసుకుంది. అసోంలోని గస్సైగామ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మజేంద్ర నర్జారీ కరోనా అనంతర సమస్యలతో కన్నుమూశారు. 68 ఏండ్ల ఆయన కరోనా సోకడంతో గువాహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో (GMCH) చికిత్స పొందారు. అయితే వైరస్ నుంచి కోలుకున్న ఆయన.. కరోనా అనంతర సమస్యలతో మళ్లీ అదే దవాఖానలో చేరారు. చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) తరఫున గస్సైగామ్ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు విజయం సాధించారు.
మజేంద్ర మృతిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ సర్మ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- BPF
- Covid complications
- GMCH
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

