Uttarakhand Landslides | విరిగిపడిన కొండచరియలు.. కారులో నలిగి పసిబాబు, ఇద్దరు మహిళలు మృతి
Uttarakhand Landslides | పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కార్లపై కొండచరియలు విరిగిపడ్డాయి (Uttarakhand Landslides). ఈ నేపథ్యంలో ఒక కారులో చిక్కుకున్న పసిబాబుతో సహా ఇద్దరు మహిళలు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
డెహ్రాడూన్: పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కార్లపై కొండచరియలు విరిగిపడ్డాయి (Uttarakhand Landslides). ఈ నేపథ్యంలో ఒక కారులో చిక్కుకున్న పసిబాబుతో సహా ఇద్దరు మహిళలు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం చంబా పోలీస్ స్టేషన్ సమీపంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండరాళ్లు, మట్టి కింద పలు వాహనాలు చిక్కుకున్నాయి. శిథిలాల నుంచి ఒక కారును బయటకు తీశారు. నాలుగు నెలల శిశువు, ఇద్దరు మహిళలు అందులో నలిగి మరణించినట్లు గుర్తించారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులను 30 ఏండ్ల పూనమ్ ఖండూరి, ఆమె నాలుగు నెలల కుమారుడు, 32 ఏండ్ల వదిన సరస్వతీ దేవిగా పోలీసులు గుర్తించారు.
కాగా, విరిగిన కొండచరియల కింద చిక్కుకున్న పలు వాహనాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటన వల్ల న్యూ తెహ్రీ, చంబా రోడ్డు మార్గం మూసుకుపోయింది. దీంతో తెహ్రీ, రిషికేశ్ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కొండచరియలు విరిగి పడిన భారీ శబ్దం విన్న స్థానికులు భయంతో తమ ఇండ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

