Maharashtra | మహారాష్ట్రలో దారుణం.. మేకను ఎత్తుకెళ్లారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు వేలాడదీశారు
మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. దొంగతనం చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను (Dalit men) చెట్టుకు వేలాడదీసి విచక్షణా రహితంగా కొట్టారు.
ముంబై: మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. దొంగతనం చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను (Dalit men) చెట్టుకు వేలాడదీసి విచక్షణా రహితంగా కొట్టారు. అహ్మద్‌నగర్ జిల్లా హారేగావ్‌లో (Haregaon) ఓ వ్యక్తికి చెందిన మేక (Goat), పలు పావురాలు (Pigeons) కనిపించకుండా పోయాయి. దీంతో తమ ఇంటికి సమీపంలో ఉండే నలుగురు దళిత యువకులపై వారికి అనుమానం (suspicion) కలిసింది. అనుకున్నదే తడవుగా మరికొందరితో కలిసి యువకులను వారి ఇండ్లను ఎత్తుకొచ్చారు.
కాళ్లు, చేతులను కట్టేసి.. ఓ చెట్టుకు వేలాడదీశారు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా వారి వీపులపై దాడికిపాల్పడ్డారు. దీనిననంతటినీ వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. బాధితుల్లో ఒకరైన షుభమ్ ఫిర్యాదుతో కేసు నమోదుతో రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని యువ్‌రాజ్ గలాండే, మనోజ్ బొడాకే, పప్పు, దీపక్ గైక్వాడ్, దుర్గేశ్ వైద్యా, రాజుగా గుర్తించారు. వారిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు.

Maharashtra 1
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ahmednagar
- Dalit men
- Goat
- hang
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

