IIT-JEE Aspirant Time Table | ఇండియాలో ఐఐటీ జేఈఈ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ రెండు ఎగ్జామ్స్‌ను ప్రతి ఏడాది లక్షల మంది అభ్యర్థులు రాస్తుంటారు. మరి ఈ పరీక్షల్లో రాణించాలంటే పక్కా ప్రణాళికతో చదవాలి. ఏ మాత్రం సమయం వృథా చేయకుండా పుస్తకాల పురుగులై పోవాలి. చదువు మీదనే ధ్యాస ఉంచాలి. ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలి. అప్పుడే ఐఐటీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఓ నెటిజన్.. తన స్నేహితుడి ఐఐటీ జేఈఈ ప్రిపరేషన్ టైం టేబుల్‌ను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
ఈ ట్వీట్‌ను చూస్తుంటూ టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో తెలిసిపోతోంది. ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యే ఆ 17 ఏండ్ల విద్యార్థి కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే నిద్రిస్తున్నట్లు దాంట్లో పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 4:30 గంటలకు నిద్ర లేచి మళ్లీ తిరిగి రాత్రి 12 గంటలకు నిద్రిస్తున్నట్లు టైం టేబుల్లో తెలిపారు.
రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు నిద్రించడం, 4:30 నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రీవియస్ చాప్టర్స్‌ను రివైజ్ చేసుకోవడం, 7 నుంచి 7:30 వరకు ఫ్రెష్, 7:45 నుంచి 10 గంటల వరకు క్లాస్ వర్క్‌లో నిమగ్నం కావడం. ఇక 10 నుంచి ఓ 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం. 10:15 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు క్లాస్ వర్క్, 12 నుంచి 12:20 వరకు లంచ్ బ్రేక్, 12:30 నుంచి 3:30 వరకు క్లాస్ వర్క్. 3:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విశ్రాంతి. సాయంత్రం 4 నుంచి రాత్రి 8:30 గంటల వరకు క్లాసెస్ వినడం, రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు నోట్స్ రాసుకోవడం, 9 నుంచి 9:30 గంటల వరకు డిన్నర్ చేయడం. రాత్రి 9:30 నుంచి 11:45 వరకు క్లాస్ వర్కులో నిమగ్నమైపోవడం. ఇక టైం టేబుల్ కింద ఈ రోజు మళ్లీ రాదు.. కాబట్టి ప్రతి రోజు కౌంటబుల్ అవుతుందని ఆ విద్యార్థి రాసుకున్నాడు.