బెంగళూరు: ఓ యువతి తానుంటున్న హాస్టల్ నుంచి కాలేజీకి (College student)వెళ్తున్నది. ఇంతలో ఆమె వెనకాల ఓ యువకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను వెంబడిస్తూ.. వేధించసాగాడు (Harassing). ఓపిక నషించిన ఆ యువతి.. వాడి గల్లా పట్టుకుని చెంప చెల్లుమనిపించింది. తన కాలుకున్న చెప్పుతీసి చెంపలువాయించిన ఘటన కర్ణాటకలోని (Karnataka) ఉడిపి జిల్లాలో జరిగింది.
ఉడిపి (Udupi) జిల్లా కుందపురాకు (Kundapura) చెందిన ఓ యువతి రోజూలానే తన హాస్టల్ నుంచి కాలేజీకి నడుకుంటూ వెళ్తున్నది. 35 ఏండ్ల ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ.. వేధించసాగాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆ యువకుడిని పట్టుకున్నారు. అందరిముందూ అతని చెంపలు వాయించింది. తన చెప్పుతో మొహంపై కొటి కోపం తీర్చుకున్నది. చేసేందేంలేక అతడు.. తనను వదిలేయాలని వారిని వేడుకున్నాడు. అయితే స్థానికులు అతడిని పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడిని నజీర్‌గా గుర్తించారు. ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.