Uttarakashi tunnel: ఉత్తరకాశీ టన్నెల్.. 31 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తి
Uttarakashi tunnel: సిల్కియారా టన్నెల్లో ఇప్పటి వరకు 31 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తి అయ్యింది. సుమారు 86 మీటర్ల లోతులో 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం వాళ్లు ఆ టన్నెల్లో చిక్కుకుపోయారు. వారి కోసం ఆ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
డెహ్రాడూన్: ఉత్తరకాశీలోని సిల్కియారా సొరంగం(Uttarakashi Tunnel)లో ప్రస్తుతం నిలువుగా డ్రిల్లింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 31 మీటర్ల మేర డ్రిల్లింగ్ జరిగినట్లు అధికారులు చెప్పారు. సుమారు 86 మీటర్ల కింద 41 మంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు. ఆ కార్మికులను రక్షించేందుకు వర్టికల్ డ్రిల్లింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. 800/900 మిల్లీమీటర్లు లేదా 1.2 మీటర్ల వెడల్పు ఉన్న పైప్‌లైన్ వేసేందుకు డ్రిల్లింగ్ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో వాతావరణ అనుకూలంగా లేదు. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు, స్నో ఫాల్ ఉంది. నవంబర్ 27వ తేదీన వర్ష సూచన ఉన్నట్లు వెదర్శాఖ వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 100 గంటల్లో 86 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేయనున్నట్లు రోడ్లశాఖ అదనపు కార్యదర్శి అహ్మద్ తెలిపారు. ఒకవేళ ఎటువంటి ఆటంకం ఎదురుకాకుంటే అనుకున్న సమయానికే డ్రిల్లింగ్ పూర్తి అవుతుందన్నారు. అయితే ఏదో ఒక దశలో మాత్రం డ్రిల్లింగ్ మెషీన్ నీడిల్‌ను మార్చాల్సి ఉంటుందన్నారు.
మాన్యువల్ డ్రిల్లింగ్ పైప్‌లో ఏర్పడే శిథిలాల్ని తొలగించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ద్వారా తొలగించనున్నారు. భారతీయ ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూపునకు చెందిన ఇంజినీర్ల బృందం డ్రిల్లింగ్ పనులు పర్యవేక్షిస్తుంది. ఈ బృందంలో ఆరు మంది స్పెషలిస్టులు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

