కేరళలో 300 కిలోల హెరాయిన్ పట్టివేత..
హెరాయిన్ | కేరళలోని విజింజం తీరంలో శ్రీలంకకు చెందిన ఫిషింగ్ నౌకనుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.

తిరువనంతపురం : కేరళలోని విజింజం తీరంలో శ్రీలంకకు చెందిన ఫిషింగ్ నౌకనుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. 300 కిలోల హెరాయిన్, ఐదు ఏకే-47 రైఫిల్స్, వెయ్యి రౌండ్ల 9 ఎంఎం మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నౌకను విజంజం నౌకాశ్రయానికి తీసుకురాగా.. హెరాయిన్ 301 ప్యాకెట్లలోని ఓడలోని వాటర్ ట్యాంక్ లోపల దాచి ఉంచగా పట్టుకున్నట్లు పేర్కొంది. ఎన్సీబీ చెన్నై జోనల్ యూనిట్ పడవను అదుపులోకి తీసుకుంది. ఓడలో నుంచి అనేక కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ నుంచి గుర్తు తెలియని ఓడ హెరాయిర్, ఆయుధాలను తీసుకువెళ్లి లక్షద్వీప్ సమీపంలోని సముద్ర జలాల్లో శ్రీలంక ఫిషింగ్ బోట్ రవిహన్సీకి అప్పగించిందని ఎన్సీబీ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా సిబ్బంది ఎల్వై నందనా, హెచ్కేజీబీ దస్ప్రియా, ఏహెచ్ఎస్ గుణశేఖర, ఎస్ఐ సేనారత్, టీ రణసింగ్, డి నిస్సంకాను అదుపులోకి తీసుకొని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు.. ఇప్పటి వరకు పాక్ ఆధారిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు ఇందులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించాయి.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
కేంద్ర మాజీ మంత్రి రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

