కుంభమేళా.. 30 మంది సాధువులకు కరోనా పాజిటివ్

హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ పుణ్య స్నానాలు చేసేందుకు వస్తున్న సాధువులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 30 మంది సాధువులకు కరోనా సంక్రమించినట్లు తేలింది. ఈ విషయాన్ని హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్కే జా తెలిపారు. అఖాడాలకు వైద్య బృందాలు వెళ్తున్నాయని, అక్కడ ఉండే సాధువులకు ఆర్సీ పీసీఆర్ పరీక్షలు నిరంతరం చేస్తున్నారని ఆయన తెలిపారు. హరిద్వార్‌లో క్రిటికల్‌గా ఉన్న కేసులను రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలను మాత్రం హోం ఐసోలేషన్లోకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హాస్పిటల్లో చేర్పిస్తున్నారు. హరిద్వార్‌లో ఉన్న హాస్పిటళ్లలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితి లేదన్నారు.
సాధువుల్లారా వెళ్లిపోండి..
హరిద్వార్‌లో నిన్న ఒక్క రోజే 600 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడ ఉన్న నిరంజనీ మఠం ఈ నేపథ్యంలో ఓ హెచ్చరిక జారీ చేసింది. కుంభమేళాలో పాల్గొంటున్న సాధువులంతా వెళ్లిపోవాలంటూ పేర్కొన్నది. నిరంజనీ అఖారా కార్యదర్శి రవీంద్ర పురి మాట్లాడుతూ.. పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల హరిద్వార్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గంగా నదిలో పుణ్యం స్నానం చేసిన సాధువులంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ కోరామని చెప్పారు. హరిద్వార్‌లో సుమారు 13 అఖారాలు ఉన్నాయి. వాటిల్లో లక్షలాది మంది సాధువులు ఉంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

