Drown In River | వ్యక్తి అంత్యక్రియలకు వెళ్తుండగా పడవ బోల్తా.. నదిలో మునిగి ముగ్గురు మృతి
Drown In River | హోలీ సందర్భంగా నదిలో మునిగి ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్యక్రియల కోసం పడవలో వెళ్తుండగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నదిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరి కొందరిని స్థానికులు రక్షించారు.
లక్నో: హోలీ సందర్భంగా నదిలో మునిగి ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్యక్రియల కోసం పడవలో వెళ్తుండగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నదిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Drown In River) మరి కొందరిని స్థానికులు రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రతన్గంజ్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల దినేష్ గుప్తా శుక్రవారం హోలీ సందర్భంగా శారదా నదిలో మునిగి మరణించాడు.
కాగా, శనివారం ఆ వ్యక్తి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు రెండు పడవల్లో శారదా నదిని దాటేందుకు బయలుదేరారు. కొంత మంది కుటుంబ సభ్యులు, దినేష్ మృతదేహాన్ని తీసుకెళ్లిన పడవ ఒడ్డుకు చేరుకున్నది. అయితే 16 మంది వ్యక్తులు ఉన్న మరో పడవ నది మధ్యలో బోల్తాపడింది. స్పందించిన స్థానికులు పలువురిని కాపాడారు. అయితే ముగ్గురు వ్యక్తులు నదిలో మునిగి మరణించారు.
మరోవైపు మృతులను 32 ఏళ్ల సంజయ్, 30 ఏళ్ల ఖుష్బూ, 13 ఏళ్ల కుంకుమ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నదిలో పడిన రెండేళ్ల చిన్నారిని రక్షించి చికిత్స తర్వాత ఇంటికి పంపినట్లు చెప్పారు. కాపాడిన మరో 12 మంది ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

