ఆక్సిజన్ కొరత.. 24 గంటల్లో 25 మంది రోగులు మృతి
ఆక్సిజన్ కొరత | ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా గత 24 గంటల్లో 25 మంది రోగులు చనిపోయినట్లు ఈ ఉదయం ఆస్పత్రి వర్గాలు

న్యూఢిల్లీ : దేశాన్ని ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. కరోనా బారిన పడ్డ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా గత 24 గంటల్లో 25 మంది రోగులు చనిపోయినట్లు ఈ ఉదయం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 60 మంది రోగుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, సకాలంలో ఆక్సిజన్ అందకపోతే వారిని ప్రాణాలతో కాపాడటం కష్టమని పేర్కొన్నారు.
రెండు గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మ్యానువల్ వెంటిలేషన్ ద్వారా ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డుల్లో రోగులకు చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు చనిపోయినట్లు ఈ ఉదయం 8 గంటలకు ప్రకటించగా, ఆ తర్వాత రెండు గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్లు ఆస్పత్రికి చేరుకున్నాయి. రోగులు చనిపోవడానికి ఆక్సిజన్ కొరత ఒక్కటే కారణం కాదు. కరోనా లక్షణాలు తీవ్రమైన తర్వాత చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నారని, తద్వారా మరణిస్తున్నారని ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
25 sickest patients have died in last 24 hrs at the hospital. Oxygen will last another 2 hrs. Ventilators & Bipap not working effectively. Need Oxygen to be airlifted urgently. Lives of another 60 sickest patients in peril: Director-Medical, Sir Ganga Ram Hospital, Delhi
— ANI (@ANI) April 23, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

