207 Kg Roti | ప్రపంచంలోనే పెద్ద రోటీ..! ఎక్కడ తయారు చేశారు..? ఎందుకంత స్పెషల్..!
207 Kg Roti | ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని రాజస్థాన్‌లోని భిల్వారాలో తయారు చేశారు. అయితే, ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. చేసిన రోటీని కాల్చేందుకు ఐదు గంటల సమయం పట్టింది.
207 Kg Roti | ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని రాజస్థాన్‌లోని భిల్వారాలో తయారు చేశారు. అయితే, ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. చేసిన రోటీని కాల్చేందుకు ఐదు గంటల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని తయారు చేసేందుకు గత రెండేళ్లుగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఎందు కోసం ఈ పెద్ద మొత్తంలో రొట్టెను తయారు చేశారో తెలిసుకుందాం రండి..!
207 కిలోల భారీ రొట్టెను భిల్వారా పట్టణం హరిసేవా ధామ్‌లో తయారు చేశారు. మహామండలేశ్వర్ సంత్ హన్స్‌రామ్ ఆధ్వర్యంలో తయారు చేశారు. ఉదయం రోటీ తయారీ పనులు మొదలు కాగా.. సాయంత్రానికి పూర్తయ్యింది. మొదట 22 మంది వ్యక్తులు కలిసి పిండిని కలిపారు. ఆ తర్వాత రోటీని తయారు చేశారు. రొట్టెను పెనంపై వేసి తిప్పకుండా ఒకేవైపు కాల్చారు. ఈ రొట్టె తయారీ కోసం 120 కేజీల గోధుమ పిండి, 10 కేజీల మైదా, 10 కేజీల నెయ్యి, 67 లీటర్ల నీళ్లను వినియోగించారు.
రెండు గంటలకుపైగా శ్రమించి భారీ కర్ర సహాయంతో రొట్టెను చేశారు. ఆ తర్వాత వేద మంత్రోచ్ఛరణల మధ్య రోటీని కాల్చారు. అంతకు ముందు భారీ రోటీని కాల్చేందుకు వెయ్యి ఇటుకలతో పొయ్యిని సిద్ధం చేశారు. 800 కిలోల బొగ్గుతో పాటు పలు వస్తువులను సైతం వినియోగించారు. సుమారు రోటీని కాల్చేందుకు నాలుగు గంటల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ రోటీని రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మిఠాయి తయారీదారులు తయారు చేసి.. అనంతరం హరిసేవా ధామ్‌కు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

