2 Strikes In 2 Years | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలు.. రెండు పెద్ద పార్టీలను చీల్చిన బీజేపీ
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎన్సీపీని బీజేపీ చీల్చింది.
ముంబై: రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎన్సీపీని బీజేపీ చీల్చింది. 2022లో తొలుత శివసేన విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర పన్నింది. దీంతో శివసేన నేత ఏక్నాథ్ షిండే ఆ పార్టీలో తిరుగుబాటు చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఆయన ఎదురుతిరిగారు. ఈ పరిణామాల వల్ల గత ఏడాది జూన్‌లో సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేయడంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం 2022 జూన్ 30న ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శివసేన రెబల్ వర్గం, బీజేపీ కలిసి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ పరిణామాల వల్ల ఆ రాష్ట్రంలో అత్యంత బలమైన శివసేన పార్టీ రెండుగా చీలింది.
కాగా, సరిగ్గా ఏడాది తర్వాత మహారాష్ట్రలో రెండో అతి పెద్ద విపక్ష పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని కూడా బీజేపీ విచ్ఛిన్నం చేసింది. రాజకీయ కురువృద్ధుడైన శరద్ పవార్ నేతృత్వంలోని ఆ పార్టీని చీల్చింది. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవర్‌తో తిరుగుబాటు చేయించింది. దీంతో ఆదివారం తన వర్గానికి చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆయన చేరారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, ఆయన వర్గానికి చెందిన చగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. అజిత్ పవార్ తిరుగుబాటుతో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండవచ్చని తెలుస్తున్నది. దీంతో ఎన్పీపీ చీఫ్ శరద్ పవార్ వర్గంలో కేవలం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉండనున్నారు. మహారాష్ట్రలో బీజేపీ రెండు కుట్రల వల్ల ఉద్ధవ్ ఠాక్రే మాదిరి రాజకీయ పరిస్థితిని శరద్ పవార్ ఎదుర్కోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

