Landslide | కొండ చరియల కింద నలిగిపోయిన కార్లు.. ఇద్దరు మృతి.. ఒళ్లు గగుర్పొడొస్తున్న వీడియో
నాగాలాండ్‌లోని (Nagaland) చమౌకేడిమా (Chumoukedima) జిల్లాలో ఘోర ప్రమాదంజరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి (Giant boulders) అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయారు.
కోహిమా: నాగాలాండ్‌లోని (Nagaland) చమౌకేడిమా (Chumoukedima) జిల్లాలో ఘోర ప్రమాదంజరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి (Giant boulders) అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Nagaland
చమౌకేడిమా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిమాపూర్ (Dimapur) నుంచి కోహిమా (Kohima) మధ్య 29వ నంబర్ జాతీయ రహదారిపై (National Highway 29) ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో పకల్ పహర్ (Pakal Pahar) వద్ద వాహనాలు నిలిచిపోయాయి. అయితే భారీ వర్షాలకు పక్కనే ఉన్న ఎత్తయిన కొండపై నుంచి ఓ భారీ బండరాయి రోడ్డుపై ఉన్న వాహనాలపైకి దూసుకొచ్చింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. క్షణాల్లోనే మరో బండరాయి ఇంకో కారుపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ప్రమాదానికి గురైన కార్ల వెనుక ఉన్న మరో వాహనంలోని ఉన్న వీడియో తీశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Nagaland
కాగా, ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో (CM Neiphiu Rio) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి వెంబడి ప్రమాదకర ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం, నేషనల్ హైవే నిర్వాహకులతో కలిసి చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Nagaland
My deepest condolences to the families of the victims of this terrible road accident wherein a giant stone rolled down from above the road on the newly built Dimapur-Kohima (Nagaland) highway today. 1 spot dead, 3 injured, and several vehicles damaged.
My thoughts and prayers… pic.twitter.com/VOZHUT1u9W
— SS Kim (@KimHaokipINC) July 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

