Kerala | కేరళలో ఘోరం.. డాక్టర్ల ప్రాణాలను బలిగొన్న గూగుల్ మ్యాప్
Kerala | కేరళలోని కొచ్చిలో ఆదివారం రాత్రి ఘోరం జరిగింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తున్న ఓ కారు పెరియార్ నదిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు.
Kerala | తిరువనంతపురం : కేరళలోని కొచ్చిలో ఆదివారం రాత్రి ఘోరం జరిగింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తున్న ఓ కారు పెరియార్ నదిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
మృతులను డాక్టర్ అద్వైత్(29), అజ్మల్(29) గా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని స్థానికులు రక్షించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారికి రహదారి సరిగా కనిపించకపోవడం, గూగుల్ మ్యాప్ పక్కదోవ పట్టించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని గూగుల్ మ్యాప్ సూచించడంతో.. కారు అటుగా వెళ్లడంతో నదిలో మునిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కారు నీట మునిగి ప్రమాదానికి గురైందని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

