2-డీజీ వచ్చేసింది

- డీఆర్డీవో కరోనా ఔషధం అందుబాటులోకి
- విడుదల చేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్
- కొవిడ్ చికిత్సలో కొత్త ఆశాకిరణమని వ్యాఖ్య
- తొలుత ఢిల్లీ దవాఖానల్లో వినియోగం
- వచ్చే నెల పూర్తిస్థాయిలో మార్కెట్లోకి
న్యూఢిల్లీ, మే 17: కరోనాపై పోరులో భాగంగా ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’ (డీఆర్డీవో) రూపొందించిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం అందుబాటులోకి వచ్చింది. తొలిబ్యాచ్ డోసులను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం డీఆర్డీవో ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. 10 వేల డోసులను కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు అందజేశారు. కొవిడ్ చికిత్సలో ఈ ఔషధం ‘ఒక కొత్త ఆశాకిరణం’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. 2-డీజీని తొలుత ఢిల్లీ దవాఖానల్లో వినియోగించనున్నారు. పొడి రూపంలో ఉండే ఈ మందును నీటిలో కలుపుకొని తాగాలి. దీనిని వాడినప్పుడు కొవిడ్ నుంచి వేగంగా కోలుకొంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైందని, కృత్రిమ ఆక్సిజన్ అవసరం కూడా తగ్గిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రెడ్డీస్ ల్యాబ్స్‌తో కలిసి డీఆర్డీవో 2డీజీని అభివృద్ధి చేసింది. ఈ ఔషధం ధర ఎంత అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. జూన్‌కల్లా పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావొచ్చని రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికిగాను 2-డీజీ ఔషధానికి డీసీజీఐ ఈ నెల 1న అనుమతినిచ్చింది.
ఎలా పనిచేస్తుందంటే?
కరోనా వైరస్ మానవ శరీరంలో ఒక కణంలోకి చేరాక ఆర్ఎన్ఏను వృద్ధి చేసుకొంటుంది. తద్వారా వైరస్ పునరుత్పత్తి జరుగుతుంది. ఈ వైరస్లు ఇతర కణాలకు విస్తరించి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. 2-డీజీ ఈ ప్రక్రియను నిలువరిస్తుంది. ఆర్ఎన్ఏను వృద్ధి చేసేందుకు కావాల్సిన గ్లూకోజ్.. వైరస్‌కు అందకుండా అడ్డుకొంటుంది. ఫలితంగా వైరస్ వృద్ధి నిలిచిపోయి రోగి త్వరగా కోలుకొంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

