దేశంలో రెండుకోట్లు దాటిన కరోనా కేసులు

- 15 రోజుల్లోనే 50 లక్షల కొత్త కేసులు
న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ ఉద్ధృతి) విలయం సృష్టిస్తున్నది. వైరస్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. సోమవారం నుంచి మంగళవారానికి 24 గంటల్లో కొత్తగా 3,57,229 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,02,82,833కు చేరింది. ఇదే సమయంలో వైరస్ కారణంగా 3,449 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 2,22,408కి చేరింది. గడిచిన 15 రోజుల్లోనే 50 లక్షలకు పైగా కేసులు నమోదవ్వడం కలవరపెడుతున్నది. దేశంలో ప్రస్తుతం 34,47,133 మంది చికిత్స పొందుతున్నారు. మహమ్మారి నుంచి ఇప్పటివరకూ 1,66,13,292 మంది (81.91 శాతం) కోలుకున్నారు. సోమవారం నాటికి 29,33,10,779 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. కొవిడ్-19 మొత్తం మరణాల్లో 70 శాతం మరణాలు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారివేనని కేంద్రం తెలిపింది. కేసుల్లో అమెరికా మొదటి, భారత్ రెండో స్థానంలో ఉండగా.. కరోనా మరణాల విషయంలో అమెరికా తొలి, బ్రెజిల్ రెండో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి.
జనవరి 30, 2020 తొలి కేసు
సెప్టెంబర్ 16, 2020 50 లక్షలు (227 రోజుల్లో)
డిసెంబర్ 19, 2020 కోటి (94 రోజుల్లో )
ఏప్రిల్ 19, 2021 1.5 కోట్లు (121 రోజుల్లో)
మే 4, 2021 2 కోట్లు (15 రోజుల్లో)
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

