Communal clashes | జోధ్‌పూర్ మత ఘర్షణల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు.. 51 మంది అరెస్ట్
Communal clashes | రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఒక షాపు, రెండు కార్లు, పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
జైపూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు (Communal clashes) జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఒక షాపు, రెండు కార్లు, పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. జోధ్‌పూర్ సుర్సాగర్ ప్రాంతంలోని రాజారాం సర్కిల్ సమీపంలోని ఈద్గా వద్ద కొత్తగా రెండు గేట్లను ముస్లింలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్నది.
కాగా, శుక్రవారం రాత్రి 10:15 గంటల సమయంలో ఈద్గా గేట్ల ప్రారంభంపై స్థానిక హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మత ఘర్షణలు జరిగాయి. రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఉద్రిక్తతలు పెరుగడంతో ఒక సమూహం స్థానిక దుకాణాన్ని తగులబెట్టింది. పోలీస్ వ్యాన్‌తో సహా రెండు కార్లను ధ్వంసం చేశారు.
మరోవైపు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అలాగే నాలుగైదు రౌండ్ల టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు. రాళ్ల దాడిలో ఒక పోలీస్ అధికారి, కానిస్టేబుల్ గాయపడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించి 51 మందిని అరెస్ట్ చేసినట్లు శనివారం వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

