New Year 2024 | న్యూఇయర్‌కు తొలిగా, చివరిగా స్వాగతం పలికే దేశాలివే..
New Year 2024 | న్యూఇయర్ 2024 (New Year 2024)ను ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సవాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది తొలి రోజును మొదటగా, చివరిగా స్వాగతం పలికే దేశాలు ఏవో చూద్దాం.
న్యూఢిల్లీ: న్యూఇయర్ 2024 (New Year 2024)ను ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సవాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది తొలి రోజును మొదటగా, చివరిగా స్వాగతం పలికే దేశాలు ఏవో చూద్దాం. పసిఫిక్ సముద్రంలోని కిరిబాటి దీవి ప్రజలు అందరికంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. జీఎంటీ ప్రకారం ఆదివారం ఉదయం పది గంటలకు, భారతీయ కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు క్రిస్మస్ ద్వీపంగా పిలిచే ఈ దీవిలో న్యూఇయర్ సందడి మొదలైంది. కిరిబాటి దీవి తర్వాత న్యూజిలాండ్‌లో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారతీయ కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఆక్లాండ్‌లో కొత్త సంవత్సరం మొదలయ్యింది. హోరెత్తించే మ్యూజిక్, వెలుగులు విరజిమ్మే ఫైర్‌వర్క్స్‌తో అక్కడి ప్రజలు న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు.
ఇక జనావాసాలు లేని హౌలాండ్, బేకర్ దీవులలో కొత్త ఏడాదికి చివరిగా స్వాగతం పలుకుతారు. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 1న సాయంత్రం 5:30 గంటలకు న్యూఇయర్‌ను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు.
ప్రపంచ కాలమానం (జీఎంటీ), భారతీయ కాలమానం (ఐఎస్టీ) ప్రకారం 2024ను వరుసగా స్వాగతించే దేశాలివే..
న్యూజిలాండ్: డిసెంబర్ 31, జీఎంటీ: ఉదయం 11:00, ఐఎస్టీ: సాయంతం 4.30
ఆస్ట్రేలియా: డిసెంబర్ 31, జీఎంటీ: మధ్యాహ్నం 1:00, ఐఎస్టీ: సాయంత్రం 6.30
జపాన్, దక్షిణ, ఉత్తర కొరియా: డిసెంబర్ 31, జీఎంటీ: మధ్యాహ్నం 3:00, ఐఎస్టీ: రాత్రి 8.30
చైనా, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్: డిసెంబర్ 31, జీఎంటీ: సాయంత్రం 4:00, ఐఎస్టీ: రాత్రి 9.30
థాయిలాండ్, వియత్నాం, కంబోడియా: డిసెంబర్ 31, జీఎంటీ: సాయంత్రం 5:00, ఐఎస్టీ: రాత్రి 10.30
భారతదేశం: డిసెంబర్ 31, జీఎంటీ: సాయంత్రం 6.30, ఐఎస్టీ: జనవరి 1 ఉదయం 00.00
యుఏఈ, ఒమన్, అజర్బైజాన్: డిసెంబర్ 31, జీఎంటీ: రాత్రి 8:00, ఐఎస్టీ: జనవరి 1 ఉదయం 1.30
గ్రీస్, దక్షిణాఫ్రికా: డిసెంబర్ 31, జీఎంటీ: రాత్రి 10:00, ఐఎస్టీ: జనవరి 1 ఉదయం 3.30
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్: డిసెంబర్ 31, జీఎంటీ: రాత్రి 11:00, ఐఎస్టీ: జనవరి 1 ఉదయం 4.30
బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్: జీఎంటీ: జనవరి 1 ఉదయం 00:00, ఐఎస్టీ: ఉదయం 5.30
బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ: జీఎంటీ: జనవరి 1 ఉదయం 3, ఐఎస్టీ: ఉదయం 8.30
ప్యూర్టో రికో, బెర్ముడా, వెనిజులా, యూఎస్ వర్జిన్ దీవులు, బ్రిటిష్ వర్జిన్ దీవులు: జీఎంటీ: జనవరి 1 ఉదయం 4, ఐఎస్టీ: ఉదయం 9.30
అమెరికా ఈస్ట్ కోస్ట్ (న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ), పెరూ, క్యూబా, బహామాస్: జీఎంటీ: జనవరి 1 ఉదయం 5, ఐఎస్టీ: ఉదయం 10.30
మెక్సికో, అమెరికాలోని కెనడాలోని కొన్ని ప్రాంతాలు: జీఎంటీ: జనవరి 1 ఉదయం 6, ఐఎస్టీ: ఉదయం 11.30 అమెరికా వెస్ట్ కోస్ట్ (లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో): జీఎంటీ: జనవరి 1 ఉదయం 8, ఐఎస్టీ: మధ్యాహ్నం 1.30
హవాయి, ఫ్రెంచ్ పాలినేషియా: జీఎంటీ: జనవరి 1 ఉదయం 10, ఐఎస్టీ: మధ్యాహ్నం 3.30
బేకర్ ద్వీపం, హౌలాండ్ ఐలాండ్: జీఎంటీ: జనవరి 1 మధ్యాహ్నం 12 గం, ఐఎస్టీ: సాయంత్రం 5.30 గంటలు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

